Friday, 22 April 2016

ఐఎస్ రాక్షసులకు శరీరాన్ని అప్పగించకుంటే...

ఐఎస్ రాక్షసులకు శరీరాన్ని అప్పగించకుంటే...


ఐఎస్ ఐఎస్...ఈ ఉగ్రవాద సంస్థ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అరాచక సంస్థల్లో ప్రథమ స్థానం ఈ రాక్షస మూకదే. ఇలా క్రూరత్వానికి - అరాచకత్వానికి మారుపేరుగా నిలిచిన ఐఎస్ ఐఎస్ 250 మంది బాలికలను పొట్టన పెట్టుకుంది.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 250 మంది బాలికలను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యం కోసం పనిచేస్తున్న ఉగ్రవాదులను తాత్కాలికంగా పెళ్లాడి వాళ్లకు సెక్స్ బానిసలుగా సేవలందించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను ఆ అమ్మాయిలు ధిక్కరించారు. తల నరికి చంపుతామని ఈ ఉగ్రవాదులు బెదిరించారు. నిరాకరించడంతో అటు 250మంది బాలికలను వారి కుటుంబ సభ్యులను అతికిరాతకంగా తలనరికి చంపేశారు. 

No comments:

Post a Comment