Thursday, 28 April 2016

బ్యాంకులకు టోపీ పెట్టిన టాప్ టెన్ ‘మాల్యా’లు

బ్యాంకులకు టోపీ పెట్టిన టాప్ టెన్ ‘మాల్యా’లు


దీన్నో అధికార దోపిడీగా చెప్పాలి. కంపెనీలు పెట్టేసి.. బ్యాంకుల దగ్గర నుంచి రుణాలు తీసుకోవటం.. కంపెనీ నష్టాల కారణంగా చేతులెత్తేయటం.. వందలాది కోట్ల రూపాయిలు అప్పుల రూపంలో ఇచ్చేసిన బ్యాంకులు ఏమీ చేయలేక కిందామీదా పడిపోవటం గత కొద్దికాలంగా చూస్తున్నదే. ఇలా బ్యాంకులకు రూ.500 కోట్లకు పైనే అప్పు ఇచ్చి అడ్డంగా బుక్ అయిన వారికి సంబంధించిన సమాచారాన్ని తనకు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆర్ బీఐని కోరిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాలకు తగ్గట్లుగా ఆర్ బీఐ ఒక జాబితాను తయారు చేసి సుప్రీంకోర్టుకు ఇచ్చింది.

ఈ సందర్భంగా ఈ సమాచారాన్ని గుట్టుగా ఉంచాలని కోరింది. బ్యాంకులకు వందలాది కోట్లు ఎగ్గొట్టిన వారి వివరాల్ని ఎందుకు గుట్టుగా ఉంచాలన్న లాజిక్ ఏమిటో అర్థం కానిది. ఇదిలా ఉంటే.. బ్యాంకులకు కంపెనీలు ఎగ్గొట్టిన అప్పుల విలువ తెలిస్తే తెల్లముఖం వేయాలి. అంత పెద్ద మొత్తం అంత దర్జాగా పక్కదారి పట్టించారా? అని ఆశ్చర్యపోవాల్సిందే. బ్యాంకులకు డిఫాల్టర్లు.. ఎగవేత మొత్తం అక్షరాల రూ.5లక్షల కోట్లు. ఇందులో రూ.500 కోట్ల కంటే ఎక్కువ ఎగవేసిన వారికి సంబంధించి వివరాలు తాజాగా బయటకు పొక్కటం సంచలనంగా మారింది.

ఆర్ బీఐ ఇచ్చిన రహస్య నివేదికను బయట పెట్టాలా? వద్దా? అన్న చర్చ ఓపక్క జరుగుతుంటే.. మరోవైపు ఆర్ బీఐ ఇచ్చిన జాబితాను న్యూస్ లాండ్రీ బయటకు పెట్టటం పెను సంచలనంగా మారింది. న్యూస్ లాండ్రీ వెల్లడించిన సమాచారం ప్రకారం.. బ్యాంకులను మోసంచేసిన మాల్యాల తరహా పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఇక.. బ్యాంకులకు పంగనామాలు పెట్టిన టాప్ టెన్ ‘మాల్యా’ల్ని చూస్తే..

1.        ఉషా ఇస్పాత్             రూ.16911 కోట్లు

2.        లాయిడ్ స్టీల్             రూ.09478 కోట్లు

3.        హిందుస్థాన్ కేబుల్స్     రూ.04917 కోట్లు

4.        హిందుస్థాన్ ఫోటో పిల్స్మ్ రూ.03929 కోట్లు

5.        జూమ్ డెవలపర్స్          రూ.03843 కోట్లు

6.        ప్రకాష్ ఇండస్ట్రీస్           రూ.03665 కోట్లు

7.        క్రేన్స్ సాఫ్ట్ వేర్             రూ.03580 కోట్లు

8.        ప్రాగ్ బాస్మీ సింథటిక్స్     రూ.03558 కోట్లు

9.        కింగ్ ఫిషర్                  రూ.03259 కోట్లు

10.     మాళవిక స్టీల్               రూ.03057 కోట్లు

Wednesday, 27 April 2016

బికినీ మాత్రం నా వల్ల కాదు

బికినీ మాత్రం నా వల్ల కాదు



ఒంపుసొంపుల ఒయ్యారాలతో.. ఇప్పటివరకు తెలుగు వారికి మత్తెక్కిస్తున్న సుందరి.. మన చందమామ కాజల్ అగర్వాల్. అయతే ఈ మధ్య ఎక్సపోజింగ్ గురించి కామెంట్లు చేస్తూ మాత్రం.. ఏదో వేదాంతం చెబుతోంది. 

''కొంతమంది బికినీ వేసుకుంటే చాలా బాగుంటారు. వారిని అలా చూస్తే మనకు ముచ్చటేస్తుంది. కాని నాది బికినీకి సరిపోయే బాడీ కాదు. అందుకని నేను బికినీల గురించి బ్యాడ్ గా కామెంట్ చేయను కాని.. నేను మాత్రం వేసుకోలేను అని చెబుతుంటా'' అంటూ సెలవిచ్చిందీ సుందరి. అయితే పొట్టి బట్టలు కూడా తనకు పెద్దగా నప్పవట. అందుకే వేసుకోదట. ఛ నిజమా? దాదాపు ప్రతీ సినిమాల్లోనూ పొట్టి బట్టల్లో పాటల్లో అల్లల్లాడిస్తుంటుంది కాజల్. నాభి సొగసలు.. క్లీవేజ్ హొయలు.. వన్నె తెచ్చే ఒంపుసొంపుల భంగిమలతో వెండితెరను సోకులతో అభిషేకం చేస్తుంది. ఇప్పుడు సడన్ గా ఈ కామెంట్లు ఏంటమ్మా బుల్లెమ్మా? 

ఇక ''సర్దార్'' సినిమా అమ్మడికి నిరాశనే మిగల్చగా.. ఇప్పుడు బ్రహ్మోత్సవం రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది. ఆ తరువాత రానా తో ఒకటి.. సందీప్ కిషన్ తో మరొక సినిమా చేయనుంది కాజల్. 

Tuesday, 26 April 2016

వెంకయ్య వల్లే బాబును దూరం పెడ్తున్న మోడీ!

వెంకయ్య వల్లే బాబును దూరం పెడ్తున్న మోడీ!


ప్రధాని మోడీకి - ఏపీ సీఎం చంద్రబాబుకు మధ్య దూరం పెరుగుతుందా? ఇద్దరి మధ్య అంతరం అంతకంతకూ విస్తరిస్తుందా? చంద్రబాబు తీరుపై ప్రధాని ఆగ్రహంతో ఉన్నారా?.. రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకున్నా మోడీని అమాంతం ఆకాశానికి ఎత్తే బాబుని... సభలల్లో ప్రత్యేకంగా కలిసినా పెద్దగా పలకరింపుల్లేకుండా... ఉండటంలాంటివి మోడీకి.. బాబుకు మధ్య దూరాన్ని తేటతెల్లం చేస్తోందని అంటున్నారు.

ఏపీ సీఎం వైఖరి వల్లే కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆలస్యం అవుతుందన్న చంద్రబాబు పలుమార్లు ఢిల్లీ పర్యటనలో ఉన్నప్పుడు మోడీని నేరుగా కలవకుండా సంబంధిత మంత్రులను కలిసి రావటం కూడా ఒక కారణంగా చెప్పుకుంటున్నారు. ఇవన్ని చూస్తుంటే. మిత్రుల మధ్య లెక్కల్లో ఎక్కడో తేడానే వచ్చినట్లే కనిపిస్తోందంటారు రాజకీయ విశ్లేషకులు.

వీరిద్దరి మధ్య తేడాతో పాటు... వెంకయ్యనాయుడిని కూడా మోడీ పెద్దగా పట్టించుకోవట్లేదనీ ఆయన మాటల్ని ఎక్కవగా పరిగణనలోకి తీసుకున్నట్టు కనిపించట్లేదన్న టాక్ కూడా ఉంది. నిజానికి వెంకయ్యకు చంద్రబాబును మంచి సాన్నిహిత్యం ఉంది. 

Monday, 25 April 2016

అదిరింది: సూర్య ‘24’ అఫీషియల్ టీజర్ (వీడియో)

అదిరింది: సూర్య ‘24’ అఫీషియల్ టీజర్ (వీడియో)

హైదరాబాద్: సూర్య హీరోగా 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘24'. 2డి ఎంటర్ టైన్మెంట్స్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు గ్లోబల్ సినిమాస్ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టీజర్ రిలీజైంది.

బాహుబలి స్థాయిలో 2016 మోస్ట్ ఎవేటెడ్ మూవీగా వస్తోన్న 24 సినిమా కోసం సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ ఈగర్ గా వెయిట్ చెస్తోంది.. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సినిమా తెలుగు టీజర్ ను యంగ్ హీరో నితిన్ ట్విట్టర్ ద్వారా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆవిష్కరించారు.

కధాకధనాలతో పాటు సాంకేతికంగా హై స్టాండర్డ్స్ లో తెరకెక్కుతోన్న 24 ఆడియెన్స్ కు ఓ సరికొత్త థ్రిల్ ను అందిస్తుందని. తిరు సినిమాటోగ్రఫి, ఎ.ఆర్ రెహ్మాన్ లాంటి టాలెంటెడ్ టెక్నీషియన్స్ కలయికలో విక్రమ్ కుమార్ విజువల్ వండర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని నిర్మాత సునీల్ N. నారంగ్ తెలిపారు. సూర్య ,సమంత, నిత్యమీనన్, అజయ్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి సంగీతం : ఏ.ఆర్.రెహ్మాన్, సినిమాటోగ్రఫీ: తిరు,కిరణ్ డెహాన్స్.., కూర్పు: ప్రవీణ్ పూడి. నిర్మాత : సునీల్ N.నారంగ్, రచన- దర్శకత్వం: విక్రమ్ కుమార్.


24 Official Teaser Telugu | Suriya, Samantha Ruth Prabhu, Nithya Menen |...

Saturday, 23 April 2016

ఆది పినిశెట్టి – మెగాస్టార్ నా నటన గురించి మాట్లాడటం నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్..!

ఆది పినిశెట్టి – మెగాస్టార్ నా నటన గురించి మాట్లాడటం నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్..!

ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడైన ఆదిపినిశెట్టి తేజ దర్శకత్వంలో వచ్చిన ’ఒక విచిత్రం’ సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు. తరువాత ఆయన తమిళ్ చేసిన ’మృగం’ అయనకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తరువాత ’వైశాలి’, ’గుండెల్లో గోదారి’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు ’సరైనోడు’ సినిమాతో తొలిసారిగా ప్రతినాయకుడిగా మనముందుకు రాబోతున్న సందర్భంగా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు
ప్రశ్న) ప్రతినాయకుడి పాత్రలు ఇకమీదట కూడా చేస్తారా..?
స) చేస్తాను. పాత్ర ఆసక్తి కరంగా ఉండి నటనకు మంచి అవకాశం ఉంటే ఎందుకు చేయను?
ప్రశ్న) మీకు తమిళ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కదా? అక్కడ ఎటువంటి స్పందన లభిస్తున్నది?
స) ఈ సినిమా చూసిన వాళ్ళు నా పాత్రను ఎంతగానో అభిమానిస్తున్నారు. నా కెరీర్ లో ఇంత త్వరగా మంచి పాత్ర చెసినందుకు అందరూ అభినందిస్తున్నారు.
ప్రశ్న) ఈ పాత్రకు ఎలా సిద్ధం అయ్యారు..?
స) నేను ఈ పాత్ర కొసం చాలా కష్టపడ్డాను. కానీ సెట్ లోకి వెళ్ళిన తర్వాత దర్శకుడు బోయపాటి శీను గారు ఈ పాత్ర గురించి ఇచ్చిన సలహాలు ఈ పాత్ర ని మరింత పవర్ ఫుల్ గా తయారు చేశాయి. నేను కేవలం ఆయన చెప్పిన సూచనలు, సలహాలు పాటించాను అంతే..
ప్రశ్న) బన్నీ తో పని చేయడం ఎలా ఉంది?
స) నాకు బన్నీ చిన్నప్పటి నుంచీ తెలుసు. ఈ సినిమా షూటింగ్ లో మేం ఎన్నోసార్లు మాపాత్రల గురించి చర్చించుకునేవారం. బన్నీ చాలా కష్టపడ్డాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపైన మోసాడు.

ప్రశ్న) ఈ సినిమాకి మీకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
స) ఈ సినిమా చూసిన చాలా మంది నాకు ఫోన్ చేసి మాట్లాడారు. అయితే అన్నిటికంటే ముఖ్యంగా… మెగాస్టార్ చిరంజీవి గారు ఫోన్ చేసి చాలా సేపు నాపాత్ర గురించి, నా నటన గురించి మాట్లాడటం మాత్రం నాకు లభించిన బెస్ట్ కాంప్లిమెంట్ గా భావిస్తున్నా

Udta Punjab | Official Trailer

Friday, 22 April 2016

I Want To Be The First Audience Of NBK100: KCR

I Want To Be The First Audience Of NBK100: KCR


The most awaited muhurtham event of Nandamuri Balakrishna's landmark 100th film Gautamiputra Satakarni took place a while ago at Annapurna Studios. The NBK100 muhurtham event was a grand affair with Telangana CM KCR giving clap, Megastar Chiranjeevi switching on the camera and Victory Venkatesh operating the camera for the first shot.

Speaking on the occasion, KCR heaped praises on Balayya's father and legendary Telugu actor and politician NT Ramarao. KCR said that he is wishing Balayya all the success for his 100th as he is a great fan of NTR. KCR also said that NTR instilled self respect among Teluguites across the world. He also vowed that nothing on earth would shift NTR Gardens from its current location.

Speaking about Balayya's 100th film, KCR said that he appreciates Balayya for choosing the story of the great ancient Telugu ruler for his 100th film and wished to be the first audience for the film and promised to watch the film along with his family members since he is a great fan of Telugu history. - See more at: http://www.gulte.com/movienews/48677/I-Want-To-Be-The-First-Audience-Of-NBK100-KCR#sthash.xcSoj7gZ.dpuf

ఐఎస్ రాక్షసులకు శరీరాన్ని అప్పగించకుంటే...

ఐఎస్ రాక్షసులకు శరీరాన్ని అప్పగించకుంటే...


ఐఎస్ ఐఎస్...ఈ ఉగ్రవాద సంస్థ గురించి పరిచయం అక్కర్లేదు. ప్రపంచంలో ఇప్పటివరకు ఉన్న అరాచక సంస్థల్లో ప్రథమ స్థానం ఈ రాక్షస మూకదే. ఇలా క్రూరత్వానికి - అరాచకత్వానికి మారుపేరుగా నిలిచిన ఐఎస్ ఐఎస్ 250 మంది బాలికలను పొట్టన పెట్టుకుంది.

ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ గుప్పిట్లో ఉన్న ఇరాక్ లోని మోసుల్ పట్టణంలో 250 మంది బాలికలను ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఇస్లామిక్ రాజ్యం కోసం పనిచేస్తున్న ఉగ్రవాదులను తాత్కాలికంగా పెళ్లాడి వాళ్లకు సెక్స్ బానిసలుగా సేవలందించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలను ఆ అమ్మాయిలు ధిక్కరించారు. తల నరికి చంపుతామని ఈ ఉగ్రవాదులు బెదిరించారు. నిరాకరించడంతో అటు 250మంది బాలికలను వారి కుటుంబ సభ్యులను అతికిరాతకంగా తలనరికి చంపేశారు. 

Thursday, 21 April 2016

బిగ్ బీ బండారం మరోసారి బట్టబయలు

బిగ్ బీ బండారం మరోసారి బట్టబయలు


ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పనామా పేపర్స్ కుంభకోణంలో భారత్ కు చెందిన పలువురు ప్రముఖుల పేర్లు వినిపించటం తెలిసిందే. ఈ జాబితాలో బాలీవుడ్ దిగ్గజం.. బిగ్ బి అమితాబ్ బచ్చన్.. ఆయన కోడలు ఐశ్వర్యారాయ్ బచ్చన్ పేర్లు వినిపించాయి.

అయితే.. బిగ్ బీ మీద తాజాగా మరో కథనం ప్రముఖ మీడియా సంస్థలో రావటం ఇప్పుడు సంచలనంగా మారింది. పాత ఆరోపణలకు కొత్త సాక్ష్యాల్ని చూపిస్తూ.. పనామా పేపర్స్ లో పేర్కొన్నట్లుగా బిగ్ బీ తప్పు చేసినట్లుగా తేల్చింది. పన్ను చెల్లించకుండా డబ్బును దేశం దాటించి విదేశీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వైనాన్ని తాజాగా బయట పెట్టటమే కాదు..

సీబుల్క్ షిప్పింగ్ కంపెనీ లిమిటెడ్?. లేడీ షిప్పింగ్ లిమిటెడ్.. ట్రెజర్ షిప్పింగ్ లిమిటెడ్.. ట్రాంప్ షిప్పింగ్ కంపెనీల్లో బిగ్ బి డైరెక్టర్ గా పని చేశారన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. ఆయన విదేశీ సంస్థల బోర్డు సమావేశాల్లో టెలిఫోన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారని పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించింది. 1994 డిసెంబరు 12న జరిగిన సీ బుల్క్ షిప్పింగ్ కంపెనీ డైరెక్టర్ గా బోర్డు సమావేశాల్లో పాల్గొన్న విషయాన్ని వెల్లడించింది. గతంతో పోలిస్తే

బొబ్బిలియుద్ధం పగలను చెరిపేసిన బాబు

బొబ్బిలియుద్ధం పగలను చెరిపేసిన బాబు

బొబ్బిలి యుద్ధం గురించి విననివారు తెలుగు నేలపై దాదాపుగా ఎవరూ ఉండరు. తెలుగు నేలపైనే కాదు... భారతదేశమంతటా బొబ్బిలి యుద్ధం గురించి తెలుసు. ఎన్ని తరాలు మారినా కూడా ఇప్పటికే  బొబ్బిలి యుద్ధంపై సినిమాలు కూడా వచ్చాయి... తాండ్రపాపారాయుడి వీరత్వంపైనా సినిమాలు వచ్చాయి..
  
చిరకాల వైరం..
  బొబ్బిలి రాజులు - విజయనగరం రాజుల మధ్య 1757 జనవరి 23న బొబ్బిలి వద్ద యుద్ధం జరిగింది. అంతకుముందు నుంచీ కూడా ఈ రెండు సంస్థానాల మధ్య వైరం ఉండేది. 1757కి కొద్దికాలం ముందు నుంచి ఉత్తరాంధ్ర సంస్థానాధీశులంతా ఫ్రెంచివారికి శిస్తు చెల్లించడం మానేశారు. ఒక్క విజయనగరం రాజులు మాత్రమే చెల్లిస్తుండేవారు. 1757లో ఫ్రెంచి జనరల్ బుస్సీ ఉత్తరాంధ్రకు వచ్చి రాజకీయం నడిపాడు. తమకు శిస్తు చెల్లించనివారిలో బలమైన రాజులైన బొబ్బిలి రాజులను ఇక్కట్లకు గురిచేయాలనుకున్నాడు. అందుకు బొబ్బిలి - విజయనగర రాజుల వైరాన్ని అవకాశంగా తీసుకున్నాడు. అప్పటి విజయనగరం రాజు విజయరామరాజు అండతో ఫ్రెంచి సైన్యాన్ని బొబ్బిలి కోటపైకి నడిపించాడు. వీరికి నిజాం సైన్యం - పెద్దాపురం రాజులు కూడా తోడయ్యారు. ఆ సమయానికి బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు బావమరిది - సైన్యాధ్యక్షుడైన తాండ్ర పాపారాయుడు రాజాం వద్ద ఉంటాడు. దీంతో బొబ్బిలిరాజా రంగారావే స్వయంగా యుద్ధంలో పాల్గొంటాడు. రాణీ మల్లమ్మదేవి వెంటనే తన సోదరుడు తాండ్ర పాపారాయుడికి కబురు పంపిస్తుంది.. కానీ ఆ వేగులను విజయనగరం రాజు సైన్యం హతమార్చడంతో పాపారాయుడికి విషయం చేరదు. ఇంతలో విజయనగరం రాజులు - ఫ్రెంచి సైన్యం - మిగతావారు కలిసి మూకుమ్మడిగా దండయాత్ర చేయడంతో బొబ్బిలి రాజు వారిని ఎదిరించలేకపోతాడు. అప్పటికే రాజు బంధువులను - బొబ్బిలి ప్రజలను చిన్నాపెద్దా తేడాలేకుండా అందరినీ ప్రత్యర్థులు హతమార్చుకుంటూ పోతుండడంతో మరణం తప్పదని గ్రహిస్తాడు. రాణి మల్లమ్మ కూడా ఆత్మత్యాగం చేసుకుంటుంది. రాజా రంగారావును విజయనగరం రాజులు హతమారుస్తారు.  తాండ్రపాపారాయుడు కోటకు వచ్చేసరికి రాజా రంగారావు - తన సోదరి మల్లమ్మ అందరూ రక్తపుటేరుల్లో ఉండడంతో ఆయన తన అనుచరులు ఇద్దరిని వెంటేసుకుని వెళ్లి విజయనగరం రాజుల శిబిరంలో చొరబడి విజయనగరం మహారాజైన పెద్ద విజయరామరాజును గుండెల్లో పొడిచి చంపేస్తాడు.  ఆ తరువాత బొబ్బిలి రాజు గోపాలకృష్ణ రంగారావు కుమారుడు - అప్పటికి పసివాడైన చిన్న రంగారావు అనంతర కాలంలో బొబ్బిలి రాజవుతాడు. విజయనగరం సింహాసనం కూడా వారసులకు చెల్లుతుంది. కానీ... అప్పటి నుంచి రెండు రాజవంశాల మధ్య పూర్తి వైరం ఉంది.

బొబ్బిలి రాజా రావు శ్వేతాచలపతి సర్ వెంకట కృష్ణ రంగారావు మరణించినప్పుడు కూడా విజయనగరం రాజులెవరూ వెళ్లలేదు. ఆ తరువాత చాలాకాలం పొలిటికల్ గ్యాప్ తరువాత బొబ్బిలి రాజులు మళ్లీ రాజకీయ రంగప్రవేశం చేశారు. ప్రస్తుత ఎమ్మెల్యే సుజయ కృష్ణ రంగారావు - ఆయన తమ్ముడు బేబీనాయనలు రాజకీయాల్లోకి వచ్చారు. ఆ సమయంలో వారు టీడీపీలో చేరాలనుకున్నారు. కానీ టీడీపీలో అప్పటికే మంచి పొజిషన్ లో ఉన్న విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు వారి రాకను వ్యతిరేకించారు
  
చారిత్రక కలయిక..
  
ఈసారి పరిస్థితులు మారాయి. విజయనగరం రాజు అశోక్ గజపతి అప్పటి కంటే కూడా టీడీపీలో పెద్ద నేతయ్యారు. కానీ ఈసారి ఆయన బొబ్బిలి రాజులను వ్యతిరేకించలేదు. బొబ్బిలి రాజులు కూడా వైరం మరిచి అశోక్ తో సయోధ్యకు ప్రయత్నించారు. అశోక్ అన్నగారు ఆనందగజపతి రాజు మరణించడంతో అశోక్ ను పరామర్శించడం కోసం బొబ్బిలి బ్రదర్సు ఇద్దరు విజయనగరం కోటలో అడుగుపెట్టి అశోక్ ను పరామర్శించారు. 259 ఏళ్ల వైరానికి ముగింపు పలకడానికి ముందడుగు వేశారు. అశోక్ కూడా వారిని ఆత్మీయంగా ఆలింగనం చేసుకుని మాట్లాడారు.
తాజాగా ఈరోజు బొబ్బిలి రాజులు టీడీపీలో చేరారు. వారు టీడీపీలో చేరడం కంటే విజయనగరం రాజులతో కలిసిమెలసి పనిచేయబోవడం అన్నది చర్చనీయాంశంగా మారింది. రెండు రాజవంశాలవారు కలిసి మాట్లాడుకోవడం.... లేదంటే ఒకరి కోటకు ఇంకొకరు వెళ్లడమన్నది ఇంతవరకు చూడలేదని విజయనగరం బొబ్బిలి ప్రజలు చెబుతున్నారు. రెండున్నర శతాబ్దాల వైరానికి ముగింపు పడడంపై ఉత్తరాంధ్రులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇంత గొప్ప నూతన చరిత్ర ఆవిష్కృతం కావడం వెనుక బొబ్బిలి విజయనగరం రాజుల పాత్రతో పాటు తెదేపా అధినేత చంద్రబాబు పాత్ర కూడా మరవలేనిదంటున్నారు.